ఏపీ, తెలంగాణలో లేడీ అఘోరీ బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అఘోరీ ఓ యువతితో మాట్లాడుతున్న ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై గుంటూరుకు చెందిన హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహరా స్పందించారు. లేడీ అఘోరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లేడీ అఘోరీ అని ఎవరూ పిలవొద్దని, వాడు శీనుగాడని పేర్కొన్నారు. సనాతన ధర్మానికి పట్టిన చీడపురుగు శీను అలియాస్ లేడీ అఘోరీ అని పేర్కొన్నారు.