బైక్‌తో పాటు వాగులో కొట్టుకుపోయిన యువకుడు.. చివరికి (వీడియో)
అల్లూరి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ యువకుడు వంతెన దాటుతుండగా.. వరద ధాటికి బైక్‌తో సహా కింద పడ్డాడు. బైక్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. అయితే వరద ప్రవాహం పెరగడంతో బైక్‌తో పాటు నీటిలో కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు యువకుడికి ఈత రావడంతో స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరాడు.