

ఉత్సవాల్లో ఘర్షణ.. రాళ్లు, కర్రలతో దాడి (వీడియో)
AP: శ్రీసత్యసాయి జిల్లా చిల్లవారిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీకాటికోటేశ్వరస్వామి ఉత్సవాల్లో స్వామివారి గుర్రాల ప్రతిమల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. మరో వర్గం స్వామి వారి గుర్రాల ప్రతిమలను ఎత్తుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ముగ్గురు వ్యక్తులు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.