తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అనుచరులు పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు కోసం మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్క ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున ఓటర్లకు పంచుతున్నట్లు సమాచారం.