బెల్లంపల్లి పట్టణంలోని అనాధ శరణాలయానికి కాసిపేట మండలంలోని ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో శనివారం రూ. రెండు లక్షల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. 2024-25 సంవత్సరానికి గాను నిత్యావసర సరుకులను కంపెనీ హెడ్ బాల గిరిధర్, సీనియర్ హెచ్ ఆర్ ఆనంద్ కులకర్ణి, జీఎం హెచ్ఆర్ ఉమా శంకర్లు అందించారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేసినట్లు వారు పేర్కొన్నారు.