TG: ‘అల్లు అర్జున్ మీద మాకు ఎలాంటి కోపం, కక్ష లేదు’ అని మంత్రి సీతక్క అన్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ వ్యవహారంలో మా జోక్యం ఏం లేదు. అల్లు అర్జున్ మామ కూడా సీఎం రేవంత్‌కు బంధువే. గతంలో చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మంత్రిగా పనిచేశారు’’ అని మంత్రి సీతక్క అన్నారు.