నటి కస్తూరికి షాక్.. ముందస్తు బెయిల్ నిరాకరణ
నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తెలుగు వారిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. కస్తూరి మాటలు విద్వేషపూరితమేనని, తెలుగువారిని కించపర్చడమేనని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారెవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా ప్రస్తుతం కస్తూరి పరారీలో ఉన్నారు.