బైక్‌కి రైలు ఇంజన్‌ను కట్టి ముందుకు లాగాలని చూశాడు.. చివరికీ (వీడియో)
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. పట్టాలపై ఆగి ఉన్న రైలింజన్ ఎదురుగా ఓ యవకుడు బైకును ఆపాడు. అనంతరం బైకు వెనుక వైపు రోప్ కట్టి, దాన్ని రైలు ఇంజిన్‌కు కట్టేశాడు. తర్వాత బైకును స్టార్ట్ చేసి రైలింజన్‌ను లాగేందుకు ప్రయత్నించాడు. ఎంత ట్రై చేసినా టైరు గిర్రున తిరుగుతుంది. కానీ రైలింజన్ మాత్రం ముందుకు కదల్లేదు. ఇలా రైలింజన్‌ను లాగాలని చాలా సేపు శ్రమించి చివరకు విఫలమయ్యాడు.