తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన AR రెహమాన్ పిల్లలు
AR రెహమాన్ విడాకులకు సంబంధించిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా ఈ విషయంపై AR రెహమాన్ పిల్లలు రహీమా, ఖతీజా, అమీన్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఈ విషయంలో గోప్యత పాటిస్తూ.. గౌరవిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు' అంటూ రహీమా పోస్ట్ పెట్టారు. 'ఈ సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని మేము వేడుకుంటున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు' అని ఖతీజా, అమీన్లు పేర్కొన్నారు.