అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గీయులు రాళ్ల దాడి (వీడియో)

68చూసినవారు
వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలంలోని రాగికుంట ప్రాంతంలో అదానీ సంస్థ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టింది. అదానీ సంస్థ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని స్థలాన్ని చదును చేస్తున్నాయి. వాటి పనులు తమకే ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు. అదానీ సంస్థ క్యాంపు కార్యాలయం, జెసిబి అద్దాలు పగలగొట్టారు. దీంతో.. డబ్బుల కోసమే వారు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్