విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సౌత్ అమెరికా దేశమైన గయానాకు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీ మోదీకి సాదర స్వాగతం పలికారు. 56 ఏళ్ల తర్వాత గయానా పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధాని మోదీనే. ఈ పర్యటనలో భాగంగా ఇర్ఫాన్ అలీతో ప్రధాని భేటీ కానున్నారు. గయానా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రసంగించనున్నారు. అనంతరం ఇండియా-కరికోమ్ సదస్సులో పాల్గొననున్నారు.