మెదక్ జిల్లా విద్యార్థులు సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కరాటే పోటీలలో 28 మంది గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ గెలిచి శభాష్ అనిపించుకున్నారు. ఈ నెల 14,15,16 తేదీలలో హైదరాబాద్ లోని పూర్ణ చంద్ర ఛాంపియన్స్ అకాడమిలో ఈ కరాటే పోటీలు నిర్వహించినట్లు కరాటే మాస్టర్ నగేష్ తెలిపారు. ఈ కరాటే పోటీలకు వివిధ రాష్ట్రాల నుండి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నట్లు వారు తెలిపారు. అయితే మెదక్ నుంచి 28 మంది మెడల్స్ సాధించారు. వీరందరికి మెదక్ గుల్షాన్ క్లబ్ లో ఈ పథకాలను, ప్రసంశ పత్రాలను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ యూత్ అఫైర్స్ ఆఫీసర్ నాగరాజ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందని కరాటే మాస్టర్ నగేష్ తెలిపారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ యూత్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ ఈ సమాజంలో పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి ఒక మంచి ఆయుధం కరాటే అని వారు అన్నారు. కరాటే లో గెలుపొందిన విద్యార్థులను వారు ప్రశంసించారు. ప్రభుత్వం కరాటేను గవర్నమెంట్ స్కూల్లో ఒక సబ్జెక్ట్ గా పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రియాజ్ మాస్టర్, దినకర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ కనబరిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
అమ్మాయిల వీభాగం లో: వైష్ణవి(గోల్డ్), విశిష్ట రాజ్(గోల్డ్), మధుప్రియ((గోల్డ్), అఖిల గౌడ్(గోల్డ్)
వెపనోస్ గర్ల్స్ వీభాగంలో: హరీ కీర్తి (గోల్డ్)
బాయ్స్ బ్లాక్ బెల్ట్ కట వీభాగంలో: అండర్-12 గణేష్ (సిల్వర్), అండర్-17రుథ్వుక్ (గోల్డ్),
బ్రౌన్ బెల్ట్ కట వీభాగంలో: అండర్-8 శ్రీ చరణ్(సిల్వర్), అండర్-10 విగ్నేష్(గోల్డ్), 12 సాయి చరణ్(గోల్డ్),
టీం కటాస్ విభాగంలో: ప్రణయ్, కృష్ణ కార్తీక్, భరత్(గోల్డ్)
వెపన్స్ విభాగంలో: అండర్ 12 విమల్ నాగ్ (సిల్వర్) 14 అబ్దుల్లా(సిల్వర్)
బెల్ట్స్ కట విభాగంలో: నో మాన్ (గోల్డ్), దుర్గ. (గోల్డ్), ముఖేష్(గోల్డ్), అఖిల్ (సిల్వర్)
సుహాస్(సిల్వర్), వీరాజ్(సిల్వర్), కనిష్క చారి (సిల్వర్), తేజ (సిల్వర్)
టీం కట విభాగం: నిక్కీ, సుశాంత్, వెళ్లొహేత్ (సిల్వర్) ప్రతిభ కనబరిచిన వారు అన్నారు.