ఎన్టీఆర్‌ ఘాట్‌ నిర్వహణపై మంత్రి నారా లోకేష్ అసంతృప్తి

50చూసినవారు
ఎన్టీఆర్‌ ఘాట్‌ నిర్వహణపై మంత్రి నారా లోకేష్ అసంతృప్తి
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ నిర్వహణపై ఏపీ మంత్రి నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందిని లోకేష్ ఆదేశించారు. ఎన్టీఆర్‌ 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌కు లోకేశ్‌ వెళ్లారు. ఘాట్‌ గోడలు, పైకప్పు పెచ్చులూడిపోవడం, గార్డెన్‌లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఘాట్ మరమ్మత్తు పనులు ప్రారంభించాలని తన సిబ్బందిని ఆదేశించారు.