నేడు ఈ సంస్థలతో సీఎం రేవంత్ కీలక చర్చలు
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రెండో రోజున సీఎం రేవంత్ పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ కానున్నారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. IT, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.