మావోయిస్టు కీలక నేత మృతి.. 14కు చేరిన మృతుల సంఖ్య

78చూసినవారు
మావోయిస్టు కీలక నేత మృతి.. 14కు చేరిన మృతుల సంఖ్య
ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గరియాబంద్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి మరణించారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో వెయ్యిమంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్