
అధికారికంగా విడిపోయిన చాహల్-ధనశ్రీ?
టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ చాహల్-ధనశ్రీ దంపతులు అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ పెట్టిన ఓ పోస్టు విడాకుల కథనాలను బలపర్చేలా ఉంది. ‘మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను కొంతకాలం తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. దేవుడిపై మీకున్న విశ్వాసమే మంచి జరిగేలా చేస్తుంది.’ అని ధనశ్రీ రాసుకొచ్చారు.