AP: ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కొత్త మెనూ అమలుకు విద్యాశాఖ సిద్ధమైంది. 4 జోన్ల వారీగా రెండు నెలలు ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఉత్తరాంధ్ర జోన్-1, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు జోన్-2, బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జోన్-3, రాయలసీమను జోన్-4గా విభజించింది. ఆయా ప్రాంతాల్లోని స్థానిక వంటలు, పోషకాలను పరిగణనలోకి తీసుకుని ఆహారం అందించనుంది.