AP: సత్యవర్ధన్ అపహరణ, బెదిరింపులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రత్యక్ష పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యవర్ధన్‌ను బెదిరించి విజయవాడలోని కోర్టులో సాక్ష్యం చెప్పించిన తర్వాత వంశీనే ఆయనను కారులో హైదరాబాద్ తీసుకెళ్లినట్లు సందేహాలున్నాయి. నిర్ధారణ కోసం సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు విజయవాడ నుంచి నలుపు రంగు కెట్రా కారులో సత్యవర్ధన్‌ను హైదరాబాద్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా అసలు గుట్టు బయటకు రానుంది.