రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ

53చూసినవారు
రంజాన్  సందర్భంగా ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ
మిర్యాలగూడ పట్టణం బంగారి గడ్డ సమీప ప్రాంతంలో రంజాన్ పర్వదిన శుభ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ నాయకుడు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ టౌన్ మీడియా కన్వీనర్ శరత్, ప్రకాష్ నగర్ ఎనిమిదో వార్డు చక్రి నాయక్, అవుట్ శ్రీనివాస్, అంబటి వెంకటకృష్ణ, ఉపేందర్, అజయ్ కొండ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్