మిర్యాలగూడ మండల పరిధిలోని చింతపల్లి గ్రామశివారులో పేకాట స్థావరంపై బుధవారం రూరల్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పదిమందికి పైగా పేకాట రాయుళ్లు అరెస్ట్ చేయగా మరికొందరు పరారైనట్లు తెలుస్తుంది. పేకాటరాయుళ్ళ నుండి నగదు, బైకులు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.