చిట్యాల: పత్తి పంటకు తగిన మద్దతు ధర కల్పించాలని డిమాండ్

62చూసినవారు
చిట్యాల: పత్తి పంటకు తగిన మద్దతు ధర కల్పించాలని డిమాండ్
చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రైతులు నిల్వ చేసిన పత్తిని సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించి, రైతులతో మాట్లాడారు. పత్తి సి. సి. ఐ. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, పత్తి పంట కు తగిన మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక, దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you