ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, వృద్ధాప్య సమస్యలతో అద్వానీ గతంలోనూ చాలా సార్లు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అద్వానీ వయసు 97 ఏళ్లు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన ఆయనను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.