AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశ్నాపత్రాల విధానం మారనుంది. ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యేలా బిట్ పేపర్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు తీసుకురానున్నారు. ప్రశ్నల్లో ఒకటి, రెండు మార్కులవి ఉండేలా పరీక్షల విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను గత పదేళ్లుగా మార్చలేదు. ఆర్ట్స్ సబ్జెక్టుల్లో కొంత వరకే మారుస్తుండగా.. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సిలబస్ చాలానే మారనుంది.