ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. సాగునీటి సంఘాల ఎన్నికలపై రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తుందన్నారు. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.