
వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా
ICC అండర్-19 ఉమెన్స్ టీ20 టీమ్‌కు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానాను ప్రకటించింది. ఈ నగదును జట్టుతో పాటు స్టాఫ్‌కు అందించనున్నట్లు తెలిపింది. ఆదివారం జరిగిన U19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 82 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ కప్ గెలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును తెలుగమ్మాయి గొంగడి త్రిష గెలుచుకుంది.