కష్టాల్లో ఇంగ్లాండ్.. 7 వికెట్లు డౌన్

56చూసినవారు
కష్టాల్లో ఇంగ్లాండ్.. 7 వికెట్లు డౌన్
భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లాండ్ కష్టాలను ఎదుర్కొంటోంది. 20 ఓవర్లలో 248 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 8.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ 55 రాణించాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన అభిషేక్ శర్మ బౌలింగ్‌లోనూ రాణించాడు. భారత్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి 2, అభిషేక్ శర్మ 2, షమీ, శివమ్, రవి బిష్ణోయ్, తలో వికెట్ తీసుకున్నారు.  ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 90.

సంబంధిత పోస్ట్