టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర 6వ విద్య వైజ్ఞానిక రాష్ట్ర మహాసభ కోసం నల్గొండ పట్టణం శుక్రవారం ముస్తాబైంది. పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో షేక్మహబూబ్అలీ ప్రాంగణంలో ఎన్. బలరాం వేదికగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో మహాసభ జరగనుంది. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం లక్ష్యంగా, ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రభావితం చేసే విధంగా తదితర అంశాలపై ఈ మహాసభలో చర్చించబోతున్నారు.