పిఆర్టియు అధ్యక్ష, కార్యదర్శులుగా సత్యనారాయణ, శ్రీనివాస్
పిఆర్టియుఎస్ సర్వసభ్య సమావేశంలో మండల శాఖ అధ్యక్షునిగా పులిపాటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కొప్పోజు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం త్రిపురారం మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి నల్లగొండ జిల్లా పిఆర్టియుఎస్ ప్రధాన కార్యదర్శి కాలం నారాయణరెడ్డి హాజరై మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పిఆర్టియుఎస్ ముందుంటుందని పేర్కొన్నారు.