AP: తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సీరియస్ అయ్యింది. ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. వైసీపీ ఎంపీ గురుమూర్తి పలువురిపై ఫిర్యాదు చేస్తే దాడులకు పాల్పడిన వారి పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు లేవో చెప్పాలంది. ఈ అంశంపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.