మే 1 నుంచి మార్కెట్‌లోకి నానో యూరియా ప్లస్‌

69చూసినవారు
మే 1 నుంచి మార్కెట్‌లోకి నానో యూరియా ప్లస్‌
నానో యూరియా ప్లస్‌ ఎరువును మే 1 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంచుతామని ఇఫ్కో సోమవారం ప్రకటించింది. దీని ఉత్పత్తి ఈ వారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. పంటలు ఎదిగేటపుడు ముఖ్యమైన సమయాల్లో నత్రజని అవసరాలను తీర్చేందుకు నానో యూరియా ప్లస్‌ ఉపయోగపడుతుందని తెలిపింది. నానో యూరియా ప్లస్‌లో నత్రజని 16 శాతం వెయిట్‌ బై వెయిట్‌ ఉంటుంది.