నేపాల్ బస్సు ప్రమాదంలో భారత్‌కు చెందిన 27 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. వారిలో 25 మంది మహారాష్ట్ర వాసులు కాగా, మిగతా ఇద్దరు యూపీకి చెందిన వారు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో 25 మంది మృతదేహాలను శనివారం జల్గావ్కు తీసుకొచ్చారు. మరో ఇద్దరి మృతదేహాలతోపాటు 52 మంది ప్రయాణికులను రోడ్డు మార్గంలో యూపీలోని మహారాజ్‌గంజ్‌కు తరలిస్తున్నారు.