కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాన్ని విడిచిపెడతారని వస్తున్న వార్తలు బాధాకరమని కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కే సుధాకరన్ అన్నారు. రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహించేందుకు వయనాడ్‌కు పరిమితం కాలేరని ఆయన వ్యాఖ్యానించారు.రాహుల్ వయనాడ్‌ను వీడుతున్నారని బాధపడుతూ ఓ మహిళ కన్నీరు కార్చడంతో తానూ చలించిపోయానని అన్నారు. రాహుల్ నిర్ణయం ఏదైనా మనం విచారించాల్సిన పనిలేదని అన్నారు.