శరీర ఉష్ణోగ్రతలలో మార్పులను తెలియజేసే సహజ రంగులతో తయారు చేసిన టీషర్ట్‌ని తమిళనాడులోని తిరుప్పూర్‌లో ప్రవేశపెట్టారు. శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీల ఫారన్‌హీట్‌కు చేరుకున్నప్పుడు టీషర్టుపై రంగు మారుతుంది. ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత అది మునుపటి రంగులోకి వస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు ధరించినా జ్వర తీవ్రతను గుర్తించవచ్చని అంటున్నారు. ఇది దోమల నివారణకారిగా కూడా ఉపయోగపడుతుందని చెప్పారు.