నిర్మల్ జిల్లా రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశించినందుకు సీఎం రేవంత్, మంత్రి సీతక్కకు ధన్య వాదాలు తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్థానిక రైతులు నిరసన తెలపడంతో ప్రభుత్వం స్పందించి పనులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు.