పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధానిని జైలు నుంచి విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా 1,000 మంది నిరసనకారులు పాకిస్థాన్ రాజధానిలో అల్లర్లు సృష్టించారు. వారందరినీ అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ పోలీసులు తెలిపారు.