మహిళలకు ఉచిత బస్సు.. కీలక అప్డేట్
AP: మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం అమలవుతున్న 5 రాష్ట్రాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కీలక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో పథకం అమలు చేయాలంటే 2 వేల అదనపు బస్సులతో పాటు 11,500 మంది సిబ్బంది అవసరమని పేర్కొంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.2,150 కోట్ల వరకు భారం పడుతుందని పేర్కొంది. అయితే ఉగాది రోజున ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.