సూపర్ స్టార్ మహేశ్ బాబు '1-నేనొక్కడినే' మూవీ ఫలితంతో సినిమాలు ఆపేద్దామనుకున్నానని డైరెక్టర్ సుకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గేమ్ ఛేంజర్' గ్లోబల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. 'USలో ఆ సినిమాకు కలెక్షన్లు రాకపోయి ఉంటే సినిమాలు మానేసేవాడిని. US ఆడియన్స్ వల్ల ఈరోజు ఇలా ఉన్నాను' అని చెప్పుకొచ్చారు. కాగా ఆ సినిమా తర్వాత సుక్కు తీసిన రంగస్థలం, పుష్ప, పుష్ప-2 సినిమాలు ఆయనను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి.