ఏపీలో రేపటి నుంచి అత్యంత భారీ వర్షాలు
AP: వాయుగుండం బుధవారం రాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మూడు రోజులు మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.