ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేష్ ఈ విషయాన్ని ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు ఈగల్‌గా నామకరణం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో పది మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.