టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంఘ సేవకులు, నటుడు, ఏవీకే ఫిలిమ్స్ అధినేత లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయకుమార్ మంగళవారం రాత్రి గుండెపోటుతో అకాల మరణం చెందారు. గత కొద్ది కాలంగా ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఇక లేరన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.