BREAKING: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా
AP: వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీ సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. జగన్ హయాంలో అవంతి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.