ఇండోనేషియాలో ఐఫోన్ 16పై నిషేధం
యాపిల్ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16పై ఇండోనేషియా నిషేధం విధించింది. తమ దేశంలో ఈ ఫోన్ విక్రయాలు, వినియోగంపై ఆంక్షలు పెట్టింది. ఇతర దేశాల్లో కొని ఆ దేశంలో వాడడంపైనా నిషేధం విధించింది. దీంతో ఆ దేశం వెళ్దామని భావిస్తున్న టూరిస్టులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఇండోనేషియాలో పెట్టుబడికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో యాపిల్ విఫలమవ్వడంతోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.