ఓవర్‌టేక్ చేస్తూ బస్సు కింద పడ్డ యువకులు.. ఒకరు మృతి (వీడియో)

82చూసినవారు
TG: ఆర్టీసీ బస్సును ఓవర్​ టేక్​ చేయబోయి డివైడర్​ను ఢీకొట్టి వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోట చేసుకుంది. బాధితులు కరీంనగర్ జిల్లా కార్ఖానా గడ్డకు చెందిన షేక్ సక్లిన్, అతని స్నేహితుడు మహమ్మద్ పుర్కన్ కలిసి ద్విచక్ర వాహనంపై కరీంనగర్ నుంచి మెహిదీపట్నంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్