కుబీర్ మండలం రంజిని తాండకు చెందిన దేవికబాయి అనే మహిళ సోమవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న తరుణంలో 108కు సమాచారం అందించగా వెంటనే స్పందించిన సిబ్బంది అంబులెన్స్ గ్రామానికి చేరుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటి పూజారి లక్ష్మణ్ మాలేగాం గ్రామం వద్ద మహిళను అంబులెన్స్ లోనే ప్రసవం చేయడం జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.