అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆర్కే రోజాపై ఫిర్యాదు
ఏపీలో వైసీపీ నేతలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ కీలక నేతలపై టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ పాలనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అప్పటి మంత్రులు అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆర్కే రోజా దుర్భాషలాడారని విశాఖ పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.