మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. చివరి రోజు ఆయా పార్టీల అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇక నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో రెండు (ఇండియా, ఎన్డీయే) కూటముల మధ్య పోరు కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళ ఓటర్లు ఉన్నారు.