సోషల్ మీడియాలో ఓ బాలిక వీడియో వైరల్ అవుతోంది. ఆమెకు చిన్నప్పుడే పెళ్లి చేయడంతో 9 ఏళ్లకే గర్భవతి అయ్యింది. ప్రపంచంలోని అనేక దేశాలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు చేస్తున్నాయి. తాజాగా ఇరాక్‌లో ఆడపిల్లల వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 9 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వీడియోలో బాలికకు సంబంధించి ఎటువంటి వివరాలు తెలియనప్పటికీ ఆడి, చదువుకోవాల్సిన బాల్యం చిద్రం చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.