
ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
AP: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లావేరు మండలం బుడుమూరు దగ్గర హైవేపై కారు ఓవర్ టెక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పాతపట్నం మండలంలోని లోగిడి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.