దేశంలో వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే 'పద్మ' అవార్డుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జులై 31న చివరి తేదీగా హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సేవ, శాస్త్ర సాంకేతిక రంగాలు, ప్రజా సంబంధాలు, వాణిజ్యం, వ్యాపార రంగాల అభివృద్ధికి పనిచేసిన వారికి పద్మ అవార్డులను ప్రకటించనున్నారు. https://awards.gov.in/ వెబ్‌సైట్‌లో నామినేషన్లను స్వీకరిస్తారు.