'డ్యాన్స్‌ చేయకపోతే సస్పెండ్‌'.. హోలీ వేడుకలో పోలీస్‌కు బెదిరింపు

70చూసినవారు
భద్రత కోసం డ్యూటీలో ఉన్న పోలీస్‌ అధికారిని ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ బెదిరించారు. బీహార్‌ రాజధాని పాట్నాలోని తన నివాసంలో మార్చి 14న హోలీ వేడుకను తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ నిర్వహించారు. హోలీ సందర్భంగా డ్యాన్స్‌ చేయకపోతే ఆయన సస్పెండ్‌ అవుతారని హెచ్చరించారు. దీంతో ఆ పోలీస్‌ అధికారి డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

సంబంధిత పోస్ట్